గుండు మధుసూదన్
వరంగల్
తేది:24-01-2016
కవిత సంఖ్య: 101
శీర్షిక: మద్యపానము వలని యనర్థము
(సమస్య: ముక్తికి మార్గమ్ము మద్యమునుఁ గ్రోలుటయే!)
కం.
త్యక్తోద్భక్తి విగాహా
శక్తత దుర్వ్యసన భార ♦ సక్త సరుగ్ణో
ద్వ్యక్తాయత దుర్జీవ
న్ముక్తికి మార్గమ్ము మద్య♦మునుఁ గ్రోలుటయే!
ప్రతిపదార్థ తాత్పర్యములు:
దుర్వ్యసన=చెడు అలవాట్లు అనెడి
భార=బరువును
సక్త=తగిలించుకొనుట ద్వారా,
ఉత్+భక్తి=గొప్పభక్తిచేత
త్యక్త=విడువబడి (భక్తికి, పూజలకు దూరమై అనుట),
విగాహ=చక్కఁగా స్నానము చేయుటకును
అశక్తత=శక్తి లేక (స్నానం కూడా చేయలేక అనుట)
సరుగ్ణ=(శరీరము) రోగగ్రస్థమైనట్లుగా
ఉత్+వ్యక్త+ఆయత=బాగుగా తెలియబడుటయను వార్తావ్యాప్తి కలిగి (అనగా
జనులందరికీ బాగా తెలియబడి అనుట)
దుర్జీవత్+ముక్తికిన్=దుఃఖకరమైనట్టి జీవనముయొక్క విడుదలకు (అనగా
దుఃఖకరమైన అకాలమరణమునకు అనుట)
మార్గమ్ము=దారితీయునది (అనగా కారణమగునది)
మద్యమునున్=మద్యమును
క్రోలుటయే=సేవించుటయే కదా!
భావం: దుర్వ్యసనాలకు బానిసను చేయడం ద్వారా...భక్తికీ, పూజాదికాలకూ దూరం
చేసి, కనీసం స్నానం కూడా చేయడానికి కూడా శక్తిలేకుండా చేసి, రోగగ్రస్థుని
చేసి, అందరిచేతా చీదరించుకోబడడం అనే దుఃఖాలను కలిగించి, చివరకు అకాల
మరణానికి గురిచేసే...మహమ్మారి..."మద్యపానమే" కదా!
స్వస్తి.
(గుండు మధుసూదన్)
వరంగల్
**************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
కవిత సంఖ్య: 102
శీర్షిక:- భక్తి హీనులు!
[బమ్మెర పోతన గారి భాగవత పద్యమైన తేటగీతికి నేనొర్చిన వృత్త రూపము]
“చేతులారంగ శివునిఁ బూ♦జింపఁడేని
నోరునొవ్వంగ హరికీర్తి ♦ నుడువఁడేని
దయయు సత్యంబు లోనుగాఁ ♦ దలఁపఁడేనిఁ
గలుగ నేటికిఁ దల్లుల ♦ కడుపు చేటు”
దీనికి నేనొర్చిన వృత్త రూపము:
ఉత్పలమాల:
పూనియుఁ జేతులారఁగ శి♦వుం దగఁ బూజలు సేయఁడేని; వా
గ్లీనత నోరు నొవ్వ హరి ♦ కీర్తి వచింపక యుండునేని; వి
శ్వాన నరుండు తా దయయు ♦ సత్యము లోనఁ దలంపఁడేని; నా
హీనుఁడు తల్లికిం గలుగ ♦ నేటికిఁ? దల్లుల కడ్పు చేటగున్!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
*********************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 24-01-2016
కవిత సంఖ్య: 103
శీర్షిక:- ద్రౌపదీ మాన సంరక్షణము!
(ఆవు-మేక-కుక్క-పిల్లి...అను పదముల నుపయోగించి భారతార్థమున నేను వ్రాసిన తేటగీతి)
[కౌరవ సభ యందు ద్రౌపదీ మాన సంరక్షణ మెటుల జరిగినదో తెలుపు సందర్భము]
తే.గీ.
ఆవురుమని ద్రోవది కృష్ణు ♦ నపుడు పిలువ;
శీఘ్రమే కన్నఁ డత్తఱిఁ ♦ జీర లిచ్చె!
కౌరవుల కుక్కడంపఁగ ♦ గాడ్పుపట్టి
ప్రతినఁ జేయఁగ; దురపిల్లి ♦ రయ్య వారు!!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
*******************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 25-01-2016
కవిత సంఖ్య: 104
శీర్షిక:- సిరుల నొసఁగు వేలుపు!
(సమస్య: సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్!)
కం.
శ్రీ నిలయ! చక్రధర! ల
క్ష్మీ నాథా! పద్మనాభ! ♦ శేష శయన! శ్రే
ష్ఠా! ఽనంత! సప్తగిరి వా
సా! నిన్ గొల్చిన లభించు ♦ సంపద లెల్లన్!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
*********************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 25-01-2016
కవిత సంఖ్య: 105
శీర్షిక:- స్వాతంత్ర్య కేతనము!
(దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి "ఎత్తండీ ఎత్తండీ స్వాతంత్ర్యపు జెండా" యను గీతమునకు నా పద్య రూపము)
ఉ.
ఎత్తఁగదోయి భారతికి ♦ స్వేచ్ఛనుఁ గూర్చిన కేతనమ్మునే;
యెత్తఁగదోయి స్వీయగళ ♦ మీ తరుణమ్మున నింగిఁ దాఁకఁగా;
నెత్తఁగదోయి భారత మ♦హీతల పూత చరిత్ర గణ్యమే;
యెత్తఁగదోయి నీ పిడికి, ♦ లెత్తియు శత్రులఁ బాఱఁ ద్రోలుమా!(1)
శా.
కేలున్ శీర్శములుం గదల్చుచును సు♦క్షేత్రాంశులౌ వీరు లీ
నేలన్ నెత్తురు పంట నీన్ మన జయంతి♦శ్రేష్ఠమే రోదసిన్
లీలన్ వెల్గుచుఁ గ్రొత్తవాఁడి వడ లీ ♦ రీతిం దగన్ నిండఁగన్,
వ్రాలంజేసి విరోధులన్, గొనుఁడు త♦ద్భ్రాజత్పతాకమ్మునే!(2)
మత్తకోకిల:
అర్థమత్తు లహంకృతు ల్మఱి ♦ యంధబుద్ధులు పేదలున్
వ్యర్థభాగ్యులునున్ నియంతలు ♦ భారతమ్మున లేనిచో,
స్వార్థ బుద్ధికి స్థానముండదు; ♦ శాంతి సౌఖ్య సుభిక్ష మ
న్వర్థనామము నీయ నెత్తుము ♦ భారతీయ పతాకమున్!(3)
మ.
కులముం దాటి, మతమ్ము దాటి,కొలఁదుల్ ♦ గొప్పల్ విచారింపకే,
కల భాగ్యమ్ములు భోగముల్ సమము సం♦స్కారమ్ములున్ నాఁటఁగన్,
వెలుఁగున్ శాంతులు, కాంతు లీ యెడను దీ♦పింపంగ, నీ భారతిన్
విలువల్ వెంచఁగ నెత్తు మన్న భరతో♦ర్వీ కేతనమ్మున్ దివిన్!(4)
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
*********************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 25-01-2016
కవిత సంఖ్య: 106
శీర్షిక:- అగ్నిస్తుతి!
తే.గీ.
అగ్నిదేవ! బర్హిష్కేష! ♦ యజ్ఞబాహు!
కీలి! కృష్ణాధ్వర! తమోఽరి! ♦ కృష్ణవర్మ!
వాయుసఖ! కృపీటభవ! సు♦వర్ణరేత!
భుజ్య! హవ్యభుక్! జ్వలన! న♦మోఽస్తు దేవ!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
*******************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 25-01-2016
కవిత సంఖ్య: 107
శీర్షిక:- ఋణానుబంధము!
ఈ క్రింది శ్లోకమునకు నా పద్యరూపము:
శ్లోకము:
ఋణానుబంధ రూపేణ, పశుపత్నీసుతాలయాః|
ఋణక్షయే క్షయం యాంతి, కా తత్ర పరిదేవనా?||
తే.గీ.
ఏ ఋణము కారణముగానొ ♦ యిట్టి బంధ
ములిలఁ గలుగును పసులు, సు♦తులును, బత్ని,
గృహ మటంచు! ఋణమ్ము తీ♦ఱిన తఱి వెసఁ
దొలఁగి పోవును! గావున ♦ దుఃఖ మేల?
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
*************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 25-01-2016
కవిత సంఖ్య: 108
శీర్షిక:- పూజ్యార్హత!
(సమస్య:- శిష్టజనాళి మెచ్చెదరె ♦ శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్)
ఉ.
దుష్టు దురాత్ము రావణుని ♦ దూషిత కర్ముని, ధర్మమార్గులౌ
శిష్టజనాళి మెచ్చెదరె? ♦ శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్
హృష్ట హృదబ్జమందు ఘన♦రీతిని నిల్పి భజించి కొల్చి సం
తుష్టునిఁ జేయు ద్రవ్యతతిఁ ♦ దోరముగా నిడి మెచ్చునట్లుగన్!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
***************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 25-01-2016
కవిత సంఖ్య: 109
శీర్షిక:- ప్రపత్తి!
తల్లిని గొల్చి, తండ్రికిని ♦ దండ మొనర్చి, గురున్ నుతించియున్,
జల్లఁగ నాతిథేయమిడి ♦ సాంగతికున్ బ్రణిపత్తి సేసి, రం
జిల్లుచు దైవమందు విల♦సిల్లెడు భక్తి ప్రపత్తితోడ నే
నుల్లము పుల్కరింప మహి♦తోక్తుల వందన మాచరించెదన్!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
***************************************************************************************
సుకవి మిత్రులు శ్రీ గుడిపల్లి వీరా రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుఁడు మీకాయురారోగ్యైశ్వర్యసుఖసంతోషశాంతిశుభసంతృప్తులనొసంగుఁగాక యని ప్రార్థించుచు...
శ్రీ వాణీ గిరిజేశు లెల్లపుడు స♦చ్ఛ్రేయాన్వితాశీస్సులన్
సేవాతత్పరు "వీర" గారికిడి; సు♦శ్రీ వైభవౌన్నత్య స
ద్భావోపేత విశిష్టకావ్య రచనా ♦ వ్యాసంగ సంసిద్ధికై
చేవన్ బుద్ధిని నిచ్చుఁగాక యని య♦ర్చింతున్ సదా దైవమున్!
-:స్వస్తి:-
భవదీయ మిత్రుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 27-01-2016
కవిత సంఖ్య: 110
శీర్షిక:- సుకవిత్వము!
కవివర నీ కవిత్వమునఁ ♦ గాంతుము స్వచ్ఛ వియన్నదీ ప్రవా
హ వర మనోజ్ఞ తైర్థ్యము! వి♦హాయస వీథ్యుపవిష్ట వాత్యమున్!
నవక వచోఽమృతార్థక ని♦నాహ్యము! శబ్ద విశేష భూషితో
ద్భవ యమకాది వేష్యము! సు♦వాక్య రసార్ణవ నవ్య కావ్యమున్!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
****************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 27-01-2016
కవిత సంఖ్య: 111
శీర్షిక:- హరిభక్త పరాభవ ఫలము!
(హరిభక్తుఁడగు నంబరీషునిపైఁ గినిసిన దుర్వాసమహర్షి కృత్యనుం బ్రయోగింపఁగఁ, గోపించిన శ్రీహరి, దుర్వాసునిపైఁ జక్రాయుధమునుం బ్రయోగింపఁగ, దానినుండి తప్పించుకొను నుపాయ మెఱుంగక తనలోఁ దా నిట్లనుకొని చింతించిన వైనము)
ఉత్పలమాల:
ఎక్కడి కేఁగువాఁడ? నిపు ♦ డెవ్వని వేడుదుఁ? జక్ర మీ విధిన్
జక్కఁగ నాదు వెంటఁబడె! ♦ శంభుఁ డజుండును బ్రోవ మందురే!
నిక్కపు విష్ణుభక్తునకు ♦ నేనిటు సేసితిఁ గీడు! పక్కి రా
జక్కిదొరా! బిరాన ననుఁ ♦ జక్రము బారిని నుండి కావరా!!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
*********************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 27-01-2016
కవిత సంఖ్య: 112
శీర్షిక:- కాళియ మర్దనము!
(సమస్య: ఏనుఁగు చిట్టెలుకఁ గాంచి యెంతొ భయపడెన్!)
[బాల కృష్ణుని కాళియమర్దన వృత్తాంతము]
కం.
మేనుం గంపన మందఁగఁ
దానా కృష్ణు పద ఘట్టి♦తముల నవయుచున్
దీనుఁడగు కాళియుం డను
నేనుఁగు, చిట్టెలుకఁ గాంచి, ♦ యెంతొ భయపడెన్!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
****************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 27-01-2016
కవిత సంఖ్య: 113
శీర్షిక:- మహిషాసుర మర్దిని!
కం.
ఖల మహిష దనుజ దురితము
విలయ ఘటిత పటు బలమున ♦ వెడలఁగ నిడియున్
నిలిపితివి యమర జయమును
దలఁతును మది నిపుడు జనని ♦ దశభుజ దుర్గా!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 27-01-2016
కవిత సంఖ్య: 114
శీర్షిక:- మృగవాహినీ! మహిష మర్దినీ!!
సురనర్తకీ/తరంగక వృత్తము(షట్పాది):
ఇందిరా రమణ సోదరీ! హిమజ! ♦ హిండి! చండి! ఖల శోషిణీ!
నందయంతి! గిరిజా! మదోత్కట! మ♦నస్వినీ! దనుజ నాశినీ!
నందితాఖిల సురేంద్ర ముఖ్య! కరు♦ణాంతరంగ! వరదాయినీ!
కందుకాభ పరిపంథి శీర్ష కర ♦ ఖండితోగ్ర! మృగవాహినీ!
వందితోరుతర భూజనాళి నత ♦ భక్తిమస్త! నగనందినీ!
మందయాన! పరమార్థ దాయిని! న♦మః సతీ! మహిష మర్దినీ!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
*************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 27-01-2016
కవిత సంఖ్య: 115
శీర్షిక:- దయామయి!
ఉత్పలమాల:
అమ్మ! మనమ్మునందు నిను ♦ నండగ నమ్మితి! నమ్ము మమ్మ! మో
హమ్ముఁ బెకల్చి, సన్మనము ♦ నందఁగ నిచ్చి, హృదంతరమ్ము శాం
తమ్మున నోలలార్చి, సత♦తమ్ము దయారస మిమ్ముఁ గూర్చి, నా
కిమ్మహి జన్మ దున్మి, యిఁకఁ ♦ గేవల సద్గతి నిమ్మ! యమ్మరో!!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 27-01-2016
కవిత సంఖ్య: 116
శీర్షిక:- నాన్న!
(చిన్ననాఁటఁ దెలియనితనముతో దేవునిఁ జూపింపుమని నాన్ననుం గోరఁగా, నాకాశమునుఁ జూపెను! నే నా దేవునిఁ జూచుటకు నా తండ్రి భుజములపైకెక్కి చూచితిని కాని, నే నా దేవుని భుజములపైననే యుంటినని నాఁడు తెలిసికొనలేకపోయితిని!)
కం.
"దేవుండెచ్చట నుండెను?
దేవునిఁ జూపింపు" మనఁగ, ♦ దివముం జూపన్;
దేవునిఁ గన భుజమెక్కియు
దేవుండగు నా జనకుని ♦ దిగువఁ గననహో!
తే.గీ.
దేవుఁ డెక్కడ నుండెనో ♦ తెలియఁ జెప్పు
మనఁగ నా తండ్రి దివిఁ జూపె; ♦ నపుడు చూడ,
నాదు తండ్రి భుజ మ్మెక్కి♦నట్టి నేను
తండ్రియే దేవుఁడని నాఁడు ♦ తలఁచనైతి!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
*************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 29-01-2016
శీర్షిక:- దత్తపదులు
[మామ-అత్త-బావ-వదిన..పదములతో...భారతార్థమున పద్యము]
కవిత సంఖ్య: 117
(కురుసభలో శ్రీకృష్ణుఁడు ధృతరాష్ట్రునితోఁ బలికిన సందర్భము)
తే.గీ.
"మామ! మామకోక్త విషయ♦మై త్వదీయ
సుతులు బంధింప నాయత్త♦కృతులునైరి!
కాన, మిముఁ బావనులఁ జేయు ♦ క్రమములోని
దీ విరాడ్రూపముఁ గనవ! ♦ దినకరసమ!"
********************
కవిత సంఖ్య: 118
(శ్రీకృష్ణుఁ డర్జునుని యుద్ధమునకై పురికొల్పు సందర్భము)
తే.గీ.
"చూపుమా మహాశౌర్యప్ర♦తాపములను!
యుద్ధమాయత్తమాయె, నో ♦ యిద్ధచరిత!
బాడబావహ్నికీలోగ్ర♦భాసమాన!
నీవ దినమణి సుతునోర్చ ♦ నెగడు యశము!"
********************
కవిత సంఖ్య: 119
(సంజయుఁడు ధృతరాష్ట్రునకు కురుక్షేత్రమందు యుద్ధమెటుల జరుగుచున్నదో వివరించు సందర్భము)
ఉత్పలమాల(పంచపాది):
ఇది వినుమా మహోగ్రతర ♦ హింస్ర యుతాంచిత హేతివాదరల్
కదనమునందుఁ ద్రుంచ క్షత♦గాత్ర విరోధి గతాత్త రోషముల్
వదన సరోవరాంబక వి♦వర్ణ సమాక్రమితమ్మయెన్ బయిన్
జదలది యెఱ్ఱఁబాఱినది ♦ సాంధ్యనుఁ బావనమౌ దివిప్రసా
ద దినపరాస్తతావదిన♦దర్శితమయ్యెను సంగరమ్మునన్!

[శవము-పాడె-కాడు-చితి..పదములతో..జన్మదిన వర్ణనము]
కవిత సంఖ్య: 120
కేశవ మురజి న్మాధవ ♦ కృష్ణ చక్రి
యనుచు హరిభక్తి జలధిలో ♦ మునిఁగి పాడె
నాదు చెలికాఁడు జన్మది♦నమ్మునాఁడు
మురిసి హరిఁజూచి తిరునామ♦మును ధరించి!
********************
కవిత సంఖ్య: 121
కేశవ! ముకుంద! మధురిపు! ♦ శ్రీశ! చక్రి!
నన్నుఁ గాపాడెదవటంచు ♦ సన్నుతింతు!
కరుణ తొలుకాడునటుల నన్ ♦ గాంచ, విమల
మతిని జన్మదినమున నెం♦చితిర నిన్ను!!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 29-01-2016
కవిత సంఖ్య: 122
శీర్షిక:- యువకుని వేదన!
[సమస్య: వార్ధకమ్మునఁ గావలెఁ బడుచు భార్య!]
("ఈ నవయౌవనంపు హేమంతమ్మునను నాకుఁ బెండ్లి యింకనుం గాలేదు గదా!"యని యొక యువకుఁడు తపించుచున్న సందర్భము)
తే.గీ.
"ఇరువదొక్కేఁడు నేఁగె! న♦భీప్సితమ్ముఁ
దీరదాయె! నా పెండ్లి కా ♦ దింత దాఁక!
రేఁగె మదిఁ గోర్కె! యీ పంచ ♦ త్రింశతియు న
వార్ధకమ్మునఁ గావలెఁ ♦ బడుచు భార్య!"
వివరణము:
పంచత్రింశతియు-నవ = 35 + 9 = 44 ఏండ్లు;
అర్ధకమ్మున = సగము వయస్సున = 44 ఏండ్లలో సగము
అనఁగా 22 ఏండ్ల వయస్సున...నని చమత్కారము!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 29-01-2016
కవిత సంఖ్య: 123
శీర్షిక:- సమస్యాపూరణములు!
[సమస్య: పున్నమి వెన్నెలయె వేఁడిఁ బుట్టించె శివా!]
(జి.హెచ్.ఎం.సి. ఎన్నికల వేఁడిమి వర్ణనము)
కం.
"మిన్నయి గెల్వఁగ నెంచిన
చెన్నగు నీ యెన్నికలను ♦ స్థిర ప్రచారా
లెన్నఁగ నాయకులకు నీ
పున్నమి వెన్నెలయె వేఁడిఁ ♦ బుట్టించె శివా!"
*******************
కవిత సంఖ్య: 124
(ఒక యువకుని స్వగతము)
కం.
"అన్నుల మిన్నల హొయళులఁ
గన్నులఁ జూడంగ, మదినిఁ ♦ గాంక్షలు హెచ్చెన్!
మిన్నంటె విరహతాపము!!
పున్నమి వెన్నెలయె వేఁడిఁ ♦ బుట్టించె శివా!!!" (2)
*******************
కవిత సంఖ్య: 125
కం.
"ౙన్నపుగొంగవు! నీకున్
గన్నయె నగ్గియు! మహేశ ♦ కరుణించుము! నీ
మిన్నంటు రూక్షవీక్షకుఁ
బున్నమి వెన్నెలయె వేఁడిఁ ♦ బుట్టించె శివా!!" (3)
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 29-01-2016
కవిత సంఖ్య: 126
శీర్షిక:- కుంతి వర ఫలము!
[దత్తపది: అల్లము-చింతపండు-కోతిమీర-జీర...పదముల నుపయోగించి...భారతార్థమున తేటగీతి]
(కర్ణ జననము జరిగిన పిదప... కుంతి విలపించుచుండ, భాస్కరుం డనునయించు సందర్భము)
సూర్యుఁడు:
"అల్ల మునిచంద్రు వరమునఁ ♦ బిల్లవాఁడు
ప్రభవ మందె! వలదు చింత! ♦ పండుగ యిదె!"
కుంతి:
"కోరి మంతుఁ జదువ నేను ♦ కోతి! మీర
రవియగా! నేను జీరఁగ, ♦ రాఁ దగు నొకొ?"
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 29-01-2016
కవిత సంఖ్య: 127
శీర్షిక:- మనో"హరి" స్మరణము!
సమస్య:-
హరిని భజించు వారల క♦నంత విపత్తులు గల్గు మిత్రమా!
పూరణము:-
చంపకమాల:
స్మరణ సుకీర్తన శ్రవణ ♦ సఖ్య నివేదన సేవ నార్చనా
పరతను దాసులై యెపుడు ♦ వందనమున్ దగఁ జేయుచున్ హరిన్
నిరతము హృత్సరోజమున ♦ నిల్పక, నిత్యము హృత్స్థయౌ "మనో
హరి"ని భజించు వారల క♦నంత విపత్తులు గల్గు మిత్రమా!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 29-01-2016
కవిత సంఖ్య: 128
శీర్షిక:- యదుకుల సోముని యాగ్రహము!
సమస్య:-
సోముఁడు నిప్పులను గుఱిసె సూర్యునివలెనే!
(సభలో శిశుపాలుఁడ ధిక్షేపించఁగా శ్రీకృష్ణుఁ డాగ్రహించిన సందర్భము)
కం.
"వేమఱుఁ బొగడఁగనేలా?
ధీమతుఁడా యాదవుండు? ♦ దివిజేశుండా?
సేమము కా" దన, యదుకుల
సోముఁడు నిప్పులను గుఱిసె ♦ సూర్యునివలెనే!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 29-01-2016
కవిత సంఖ్య: 129
శీర్షిక:- హరి దాసుఁడు...గరుత్మంతుఁడు!
సమస్య:-
గరుడునిఁ గని సంతసించుఁ గద భుజగమ్ముల్!
పూరణము:
(తమ దాసత్వము నుండి విడుదలాయెనని వగచిన నాగులు...గరుడుఁడు శ్రీహరి దాసుఁడాయెనని యానందించిరనుట)
కం.
త్వర నమృత మిడి చెలంగిన
గరుడుని దాస్యమ్ము తొలఁగఁ♦గాఁ గుమిలియు, శ్రీ
హరికిని దాస్యముఁ జేసెడి
గరుడునిఁ గని, సంతసించుఁ ♦ గద భుజగమ్ముల్!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 29-01-2016
కవిత సంఖ్య: 130
శీర్షిక:- సీత భూ ప్రవేశము!
సమస్య:-
మారుతి యేతెంచె సీత మాయం బయ్యెన్!
పూరణము:-
(జనాపవాద భీతిచే శ్రీరాముఁడు సీత నరణ్యమునకుఁ బంపఁగా నచటఁ బ్రాణత్యాగ మొనర్పఁబోవు సీతను వాల్మీకి తన యాశ్రమమునకుం గొంపోయిన తదుపరి యేర్పడిన పరిస్థితులను వివరించు సందర్భము)
కం.
చేరంబిల్చియు, దుఃఖవి
దూరుఁడు వాల్మీకిముని బ్ర♦తుకు నిడె! నచటన్
ధీరు లొదవి, యశ్వముఁ గొన,
మారుతి యేతెంచె! సీత ♦ మాయం బయ్యెన్!!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 29-01-2016
శీర్షిక:- తీఱిన కోరిక!
సమస్య:-
కోర్కె తీఱిన భక్తుఁడు గొల్లుమనియె!
పూరణములు:-
కవిత సంఖ్య: 131
(భగవంతుఁడు తన కోఱిక తీర్చక, పరుని కోర్కినిం దీర్చఁగ, గొల్లుమనిన సందర్భము)
తే.గీ.
ఎన్ని నాళుల నుండియో ♦ యింత తపము
చేసి, పూజించి, వేడినం ♦ జిత్త మలరఁ
దనదు కోరిక తీఱక, ♦ తనరఁ, బరుని
కోర్కె తీఱిన, భక్తుఁడు ♦ గొల్లుమనియె!
*** *** *** ***
కవిత సంఖ్య: 132
(మొదటివాఁ డేది కోరిన, దానికి రెట్టింపు కావలెనని దేవునిం గోరిన భక్తుని భంగపాటు)
తే.గీ.
ఇర్వుఱును నోర్వలేనట్టి ♦ యీసు తోడ
వరములం గోరిరయ్య! దై♦వమును నొకఁడు
వేడె "నొక కన్నుఁ గొను"మని! ♦ "ద్విగుణ" మడిగి,
కోర్కె తీఱిన భక్తుఁడు, ♦ గొల్లుమనియె!!
*** *** *** ***
కవిత సంఖ్య: 133
(తాను పట్టిన దెల్ల బంగారము కావలెనని కోరిన రాజు, తన కుమార్తెనుం దాఁకఁగనే బంగరు బొమ్మ యగుటచే గొల్లుమనిన సందర్భము)
తే.గీ.
ఒక్కఁ డత్యాశచే వేల్పు ♦ నొక్క కోర్కి
కోరె "నేను పట్టిన దెల్లఁ ♦ గుందన మగు
త" యని! తాను ముట్టఁగఁ ద♦నయ వసువయెఁ!
గోర్కె తీఱిన భక్తుఁడు ♦ గొల్లుమనియె!!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 30-01-2016
కవిత సంఖ్య: 134
శీర్షిక:- మాంసభక్షక ద్విజులు!
సమస్య:-
మాంసభక్షణచే ద్విజుల్ మాన్యులైరి!!
పూరణము:-
(ద్విజుఁ డనఁగా బ్రాహ్మణుఁ డన్న యర్థమునుం దీసికొనక, గరుడుఁడు, నాదిశేషుఁ డను నర్థములఁ గైకొనుటచే సాధించిన చమత్కారము)
తే.గీ.
ద్విజుఁడు గరుడుండుఁ దేరయ్యె ♦ విష్ణువునకు!
ద్విజుఁడు శేషుండుఁ బరుపయ్యె ♦ విష్ణువునకు!
బండియుం బాన్పులై విష్ణు ♦ భక్తులయ్యు
మాంసభక్షణచే ద్విజుల్ ♦ మాన్యులైరి!!
వివరణము:
(ద్విజుఁడు = రెండు పుట్టుకలు కలవాఁడు [గ్రుడ్డుగా మొదటిజన్మ, గ్రుడ్డులోనుండి రెండవ జన్మగల] గరుడుఁడు, ఆదిశేషుఁడు...ఇద్దఱును మాంసాహారులే యయినను విష్ణుసేవ యొనర్చి మాన్యులైనారు కదా!)
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 30-01-2016
శీర్షిక:- సూక్తి ముక్తావళి!
కవిత సంఖ్య:135
కం.
అశన శయన భయ రతములు
పశువులకును మనుజులకునుఁ ♦ బఱఁగ సమములే!
విశద మతియు మనుజుల కిల
వశమగుడును నధికు! లవశ♦పరతనుఁ బశువుల్!!
కవిత సంఖ్య:136
కం.
స్వజన సమమైన విద్యయు;
రుజ సమమగు శత్రువు; కొమ♦రునిఁ బోలు చెలుం
డు; జగన్నాథు సమ బలము;
నిజముగ లేవిజ్జగమున ♦ నిర్ధారింపన్!
కవిత సంఖ్య:137
కం.
పాండిత్యము రాచఱికము
రెండింటినిఁ బోల్పఁ గలమె? ♦ ఱేనిన్ వలచున్
మండల జన నుతులును; మఱి
పండితు నీ లోకమందు ♦ వలచుఁ బ్రతిష్ఠల్!!
కవిత సంఖ్య:138
కం.
క్షణమును విడువక విద్యను
కణమును విడువకయె ధనము ♦ గడియింప వలెన్!
క్షణ వర్జిత విద్య మఱియు
కణ వర్జిత ధనము నెచటఁ ♦ గన మీ జగతిన్!!
కవిత సంఖ్య:139
కం.
అగుణమ్ములు లాలనమున
సుగుణమ్ములు తాడనమునఁ ♦ జూడఁగఁ గలుగున్!
నెగడి సుతుని శిష్యుని నిలఁ
బొగడక శిక్షింపఁ గలుగుఁ ♦ బొసఁగ సుగుణముల్!!
కవిత సంఖ్య:140
కం.
సాధనమున విద్య యెసఁగు;
శోధిత కర్మమున బుద్ధి; ♦ సూద్యమమున సు
స్వాధీన మగును ధన; మని
రోధిత భాగ్యవశమునఁ గ♦లుగును ఫలమ్ముల్!

హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్!
కవిత సంఖ్య:141
కం.
హరి మురహరియను చోరులు
హరియింపఁగ నొకరియింట ♦ నడుగిడ, నచటన్
హరివర్ణపు నగఁ గని, ముర
హరి హరికిన్ హరినిఁ జూపి ♦ "హరియింపు" మనెన్!
(హరినిన్ = హరివర్ణ (పచ్చని రంగుగల) ఆభరణమును)
*****************
కవిత సంఖ్య:142
కం.
హరియింతు నను కశిపునకు
హరి నా ప్రహ్లాదుఁ డపుడు ♦ "హరి హరి"యనుచున్
బరగంగఁ బిలిచి మదమో
హరి హరికిన్ హరినిఁ జూపి ♦ "హరియింపు" మనెన్!
(మదమోహరి హరికిన్ = మదమును, మోహమునుం గలవాఁడును, దివిజపురాపహారియునగు హిరణ్యకశిపునకు)
*****************
కవిత సంఖ్య:143
కం.
హరి హరి! సర్పము కప్పను
హరియింప వెనుఁ దవులఁ గని ♦ "హా హా"యనఁగన్
"బరగ నిది తిండియౌ"నని
హరి, హరికిన్ హరినిఁ జూపి, ♦ "హరియింపు" మనెన్!
(హరి = విష్ణువు, హరికిన్ = సర్పమునకు, హరినిన్ = కప్పను)
*****************
కవిత సంఖ్య:144
కం.
హరిణాక్షి వెంట రాఁగా,
హరి హరిపురి కరుగుఁదెంచ, ♦ హరితవనమునన్
విరి తావిఁ గొని హరిమనో
హరి, హరికిన్ హరినిఁ జూపి, ♦ "హరియింపు" మనెన్!
(హరినిన్+చూపి=హరితవనమున విరి తావినిం బ్రసరింపఁజేసెడు పారిజాతమనియెడు దేవతావృక్షమునుం జూపించి)
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 30-01-2016
కవిత సంఖ్య:145
శీర్షిక:- ద్రౌపది నివేదనము!
(దత్తపది: కరము-భరము-వరము-హరము...పదముల నుపయోగించి...భారతార్థమున వ్రాసిన పద్యము)
చంపకమాల:
కర మురు వేణి వట్టి, కడు ♦ గర్వముతోడుత వల్వ లూడ్చె ని
ర్భరమున; సత్సభాంతరము ♦ భగ్గన, సిగ్గఱి కౌరవుల్, రమా
వర! మురహంత! నాకుఁ దల♦వంపులు సేసిరి! వారి నొంచు మో
హరమును బన్ని, సంధిఁ బరి♦హార్యము సేయుము! యుద్ధమే తగున్!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 30-01-2016
కవిత సంఖ్య:146
శీర్షిక:- సీతా విలాపము!
[దత్తపది: అల-కల-తల-వల...పదముల నుపయోగించి...రామాయణార్థమున వ్రాసిన పద్యము]
(అశోకవనమున రాక్షసస్త్రీల నడుమఁ జెఱలోనుండి శ్రీరామునిఁ దలఁచుకొనుచు సీత విలపించు సందర్భము)
॥సీ॥
అలరారు నడలతో ♦ నలరు బంగరు జింకఁ
.....గోరఁగ, నీ వేగ, ♦ నలవికాని
సకల మాయలఁ గ్రమ్మి, ♦ సరగున నిఁక లంక
.....కునుఁ దెచ్చి, కలఁగించెఁ ♦ గూటవృత్తుఁ
డగు పదితలల దుం♦డగుఁడు, దుశ్చింతల
.....వంతల నిడె నాకు ♦ బలిమితోడఁ;
జావవలచియుంటి ♦ సత్వర మ్మీవిట
.....నడుగిడకున్న, దా♦నవల వలన!
॥గీ॥
నలవి కానట్టి చెఱను నే ♦ ననుభవించు
చుంటి; వికలమాయెను హృది; ♦ శోభ తలఁగెఁ;
దలఁపులో నిన్ను నిలిపితి; ♦ దనుజుఁ జంపి,
త్వరగ ననుఁ జెఱనుండి యీ♦వలకుఁ దెమ్ము!!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 30-01-2016
కవిత సంఖ్య:147
శీర్షిక:- ననలు!(పూవులు)
[దత్తపది: తల...ను ప్రతి పాదమున నుపయోగించి... పూలతోటను వర్ణించిన పద్యము]
కం.
వనితల తలఁపులఁ బొదలుచు
ననల సువాసనలె తలల ♦ నర్తిత లతలై
తనరు వనధృత లలితలనుఁ
గనఁగా వెతలన్ని సమయు ♦ క్ష్మాతలమందున్!!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 30-01-2016
కవిత సంఖ్య:148
శీర్షిక:- తాటకా సంహార ప్రోత్సాహము!
[దత్తపది: గోలి-గుండు-మంద-మల్లెల...అను పదముల నుపయోగించి... రామాయణార్థమున వ్రాసిన పద్యములు]
(మహర్షి విశ్వామిత్రుఁడు శ్రీరామునిం దాటకనుఁ బరిమార్చుటకై పురికొల్పుచుఁ బలికిన సందర్భము)
తే.గీ. (పంచపాది):
"తాటకి యదిగో! లిప్తయం♦దది కనఁబడి,
మదినిఁ గలగుండు వడఁగాను ♦ మాయమగుచు,
మునులు భయమందనఱచుచుఁ ♦ గనలుచుండె!
క్షిప్రమే కాండ మల్లె ల♦క్షించి దానిఁ
గూల్చు మోరామచంద్ర! సం♦కోచ మేల?"
********************
కవిత సంఖ్య:149
శీర్షిక:- త్రిజట మందలింపు!
(సీతాదేవియొద్ద గోలచేయుచున్న రాక్షస వనితల నుద్దేశించి త్రిజట హనుమంతునిం బొగడుచుఁ బలికిన సందర్భము)
మత్తేభము:
"మన గోలిట్టుల నుండనిండు! మనమా ♦ మాన్యన్ బ్రతారించినన్,
హనుమంతుం డట రామనామజపితో♦ద్యన్మంగళాంగుండునై,
జనకాత్మోద్భవ హర్షమంద నపుడా ♦ చందాన రామోర్మికన్
వినుతుల్ సేయుచు వేగ నీన్, గురిసె తీ♦వెల్ మల్లె లవ్వీరుపై!!" (2)
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 30-01-2016
కవిత సంఖ్య:150
శీర్షిక:- మత సామరస్యము!
దత్తపది:-
యేసు-చర్చి-సిలువ-మేరీ...అను పదముల నుపయోగించి... మత సామరస్యమును గూర్చి వ్రాసిన పద్యము
తే.గీ.
సమతయే సుఖశాంతులు ♦ మమత లొసఁగు
ననియ చర్చిలు మతపెద్ద♦లంద ఱిటులె
యెపుడు నడువ, భాసిలు వక్త♦లే యగుదురు!
పర మత జన మే రీఢయు ♦ ౙరుప దెపుడు!!
(చర్చిలు=చర్చింౘు, రీఢ=అవమానము, తిరస్కారము)
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 30-01-2016
కవిత సంఖ్య:151
శీర్షిక:- ఓం శ్రీ మాత్రే నమః!
దత్తపది:-
అలి-నోలి-కోలి-మొలి...అను (నిరర్థక) పదముల నుపయోగించి... లలితాదేవీ స్తుతి పద్యము
ఆ.వె.:
అలికనేత్రి! హే స♦కల జగత్ప్రసవిత్రి!
సతముఁ గొల్తు నోలి ♦ శైలపుత్రి!
త్రిపురసుందరి! కస♦రేలకో? లిప్స నా
కీఁ గరుణ రస మొలి♦కింపు ధాత్రి!!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 30-01-2016
కవిత సంఖ్య:152
శీర్షిక:- ఎనుఁగు నాఁటిన కాంతలు!
సమస్య:-
గడ్డములఁ బెంచి మురిసిరి కాంత లెల్ల!
(ఒక యింటి కోడండ్రు తమ యింట జరుగు తతంగమునుం బరులు కనకుండుటకుం జేసిన యుపాయము)
తే.గీ.
ఇంటి ముంగిలి హద్దుగా ♦ నెనుఁగు లేక
బయటివారలు తమయింటఁ ♦ బరఁగు కతలఁ
గనుచు నుండంగఁ, గనకుండు ♦ కారణమ్మ
గడ్డములఁ బెంచి, మురిసిరి ♦ కాంత లెల్ల!
వివరణము:-
{కనకుండు కారణమ్ము + అగు + అడ్డములన్ + పెంచి మురిసిరి = అడ్డముగనుంటకై మొక్కలం బెంచి, చాటగుటచే మురిసిపోయిరని భావము}
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 30-01-2016
కవిత సంఖ్య:153
శీర్షిక:- అమర గాయని...ఎం.ఎస్.సుబ్బలక్ష్మి!
తే.గీ.
గొంతు డాఁగిన యమృతమ్ముఁ ♦ గురియఁ జేసి,
పండితులఁ బామరులఁ దేల్చె ♦ స్వర్గమందు;
మధురయినఁ బుట్టి, వెలిఁగిన ♦ మణియునైన
సుప్రభాతంపు వీణియ ♦ సుబ్బలక్ష్మి!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 31-01-2016
కవిత సంఖ్య: 154
శీర్షిక:- మాటతప్పువాఁడు...
సమస్య:-
మాట తప్పువాఁడు మంచివాఁడు!
పూరణము:-
భాష పైన గొప్ప ♦ పట్టున్న పండితుం
డతఁడు మాట లాడ ♦ నమృత మొలుకు!
వాని మాట పసిఁడి! ♦ వానికి లేదయ్య
మాట తప్పు! వాఁడు ♦ మంచివాఁడు!!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 31-01-2016
కవిత సంఖ్య: 155
శీర్షిక:- వంటఁ జేయలేనివాఁడు మగఁడా?
సమస్య:-
వంటఁ జేయలేనివాఁడు మగఁడె?
పూరణము:-
(శివపార్వతులనుఁ గలుపుటకై కబురంపిన యింద్రునితో మన్మథుడు పలికిన మాటలు)
ఆ.వె.
"చివురు లెత్తఁ బ్రేమ ♦ శివపార్వతులలోన
నిపుడు వేతు నేను ♦ నిట్టి బాణ
మిదియ పూవుటమ్ము ♦ నిది వేసి యా తను
వంటఁ జేయలేనివాఁడు మగఁడె?"
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 31-01-2016
కవిత సంఖ్య: 156
శీర్షిక:- పితృవాక్పాలనము!
సమస్య:-
పితరుని వధించి తినునట్టి సుతుఁడె హితుఁడు!
పూరణము:-
తే.గీ.
వేఁట నెపమున వని కేఁగి, ♦ వెంట సుతుని
నిడుకొనియు, నొక్క కిటిఁ జూచి, ♦ “కొడుక! దానిఁ
జంపి మాంసమ్ముఁ దిను” మన; ♦ సమ్మతించి
పితరుని; వధించి తినునట్టి ♦ సుతుఁడె హితుఁడు!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 31-01-2016
కవిత సంఖ్య: 157
శీర్షిక:- మాతా! గురుపత్నీ! నమః!!
సమస్య:-
గురుపత్నినిఁ గోరువాఁడె గుణవంతుఁ డగున్!
పూరణము:-
కం.
గురువు దివికేఁగ శిష్యుఁడు
హరిఁ గోరి తప మ్మొనర్చి, ♦ హరి వర మీయన్;
"గురుఁ జేర దివికిఁ జను"మని
గురుపత్నినిఁ గోరువాఁడె ♦ గుణవంతుఁ డగున్!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 31-01-2016
శీర్షిక:- యోగి!
సమస్య:-
వేశ్య కౌఁగిలింతను గోరి వెడలె యోగి!
పూరణములు:-
కవిత సంఖ్య: 158
తే.గీ.
పృథ్విపైనున్న దినములు ♦ వేద పఠన,
పాఠన, తపో విశేష, స♦ద్బ్రహ్మచర్య
దీక్షఁ గడపియు, మరణించి, ♦ దివికి దేవ
వేశ్య కౌఁగిలింతనుఁ గోరి ♦ వెడలె యోగి!
*******************
కవిత సంఖ్య: 159
(రోమపాదుఁడు ఋష్యశృంగుని దన నగరమునకు రప్పించిన సందర్భము)
తే,గీ.
ఋషి వనస్థిత మౌనీంద్రు ♦ ఋష్యశృంగు
స్వీయ నగర ప్రవిష్టునిఁ ♦ జేయ నెంచి,
తనదు వారాంగనలఁ బంపఁ ♦ దాఁ దెలియక
వేశ్య కౌఁగిలింతనుఁ గోరి ♦ వెడలె యోగి!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 31-01-2016
కవిత సంఖ్య: 160
శీర్షిక:- నిజమగు యౌవనము!
అల వసంతమ్ము చెట్లకు ♦ యౌవనమిడు;
ధనమె నరులకు యౌవ సా♦ధకము నగును;
నారి సౌభాగ్యమే యౌవ♦నమ్ము సుమ్ము;
పండయే పండితులకు యౌ♦వనము నిడును!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 31-01-2016
కవిత సంఖ్య: 161
శీర్షిక:- శివస్తుతి (విశేష వృత్తమున)
సరోజ వృత్తము:
అంగజాంతక! ధూర్జటీ!
లింగమూర్తి! మహేశ్వరా!
త్ర్యంగటా! సురసేవితా!
పింగళాక్ష! నమోఽస్తుతే!!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 31-01-2016
శీర్షిక:- హరి ద్వారపాలకుఁడు!
సమస్య:-
రామ భక్తులలో మేటి రావణుండు!
కవిత సంఖ్య: 162
(శప్తులైన హరిద్వారపాలకులగు జయవిజయుల కథ నిట ననుసంధానించుకొనుఁడు)
తే.గీ.
విష్ణువుం జేరఁ ద్వరపడెఁ! ♦ బ్రేమ వీడి,
వైరమును బూనెఁ! బలుమఱు ♦ వైష్ణవులను
బాధపెట్టె! సీతను దెచ్చె! ♦ వైరులైన
రామభక్తులలో మేటి ♦ రావణుండు!!
********************
కవిత సంఖ్య: 163
(తల్లి కోర్కెనుం దీర్ప నెంచిన రావణుని కృతము నిట ననుసంధానించుకొనునది)
తే.గీ.
తల్లి పనుపున శివునికై ♦ తపము సేసి,
యాత్మలింగమ్ము కొఱకు దే♦హమును మిగులఁ
జిదుపలుగఁ జేసి, గెలిచిన ♦ శివమతాభి
రామ భక్తులలో మేటి ♦ రావణుండు!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 31-01-2016
శీర్షిక:- చేపల పులుసు - వశిష్ఠుఁడు!
సమస్య:-
చేపల పులుసడిగెరా వశిష్ఠుఁడు ప్రీతిన్!
కవిత సంఖ్య: 164
(ఏకాదశి నాఁటి యుపవాస దీక్ష చెడకుండుటకై వశిష్ఠుఁడు పలికిన సందర్భము)
కం.
తాపసి కాతిథ్యం బిడఁ
గా, పాఱుం డొకఁడు పిలువఁ ♦ గా దనకయె దా
దాపది తప్పించుకొనఁగఁ
జేపల పులుసడిగెరా, వ♦శిష్ఠుఁడు ప్రీతిన్!
******************
కవిత సంఖ్య: 165
(మూఢుని జిహ్వ చాపల్యముం బోగొట్టిన వశిష్ఠుఁడు)
కం.
సాపాటున కొక మూఢుఁడు
చేపల పులుసడిగెరా! వ♦శిష్ఠుఁడు ప్రీతిన్
దాపునకుఁ బిల్చి, యాతని
చాపల్యముఁ బోవఁ జేసి, ♦ సద్గురు వాయెన్!
*******************
కవిత సంఖ్య: 166
(3)
(మిత్రసహుఁడను రాజునింటికి భోజనమునకై వెడలినపుడు వశిష్ఠునిపై నొక దనుజుఁడు మాయఁ బన్నిన సందర్భము)
సాపాటున నర మాంసము,
చేపల పులుసడిగెరా, వ♦శిష్ఠుఁడు ప్రీతిన్!
దాపున నవి కని, వెంటనె
కోపము రా, నపుడు దనుజు ♦ ఘోరముఁ దెలిసెన్!
******************
కవిత సంఖ్య: 167
(పరస్పర శాపకారణమున వశిష్ఠుఁడు ఆడేలుగను, విశ్వామిత్రుండు బకముగను మారి, కలహించు సందర్భము)
దాపున గాధిజుఁ గని, నగి,
చేపల పులుసడిగెరా వ♦శిష్ఠుఁడు ప్రీతిన్!
'చేపల నీవే తిను'మని
తాపసి యాడేలు కనియెఁ ♦ దాఁ దోడేలై!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 31-01-2016
శీర్షిక:- అసంబద్ధమా? కాదు, సుసంబద్ధమే!
సమస్య:-
అఱవమునందు వేమన మహాకవి భాగవతమ్ముఁ జెప్పెఁగా!
కవిత సంఖ్య: 168
(క్రమాలంకారమునఁ జేసిన పూరణము)
చం.
అఱవలు నెందుఁ బల్కెదరొ? ♦ యాటవెలందుల యోగి యెవ్వఁడో?
కఱగఁగఁ జేయు మానసముఁ ♦ గావ్యముచే నతఁ డెవ్వఁడో కదా?
వఱలెడు భక్తితోడుతను ♦ బమ్మెర పోతన యేమి సెప్పెనో?
యఱవమునందు; వేమన; మ♦హాకవి; భాగవతమ్ముఁ జెప్పెఁగా!
[పద్యమందుఁగల నాలుఁగు ప్రశ్నములకును నాలుఁగవ పాదమునఁ గ్రమముగ సమాధానములు చెప్పఁబడినవి]
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 01-02-2016
శీర్షిక:- సూక్తి ముక్తావళి!
కవిత సంఖ్య: 169
ఆ.వె.
ధనసమార్జనమున, ♦ ధన రక్షణమ్మున,
ధన వినష్టముననుఁ ♦ దఱచి చూడ
దుఃఖ మొదవునయ్య ♦ తోరమ్ముగా నీకు!
వలెనె ధనము? దుఃఖ ♦ భాజన మదె!
******************
కవిత సంఖ్య: 170
తే.గీ.
అధిక భారమ్ము లేదు స♦మర్థులకును;
దూరమే లేదు యత్నించు♦వారలకును;
పండితుఁడు నెప్డుఁ బరదేశ♦వాసి కాఁడు;
రమ్య భాషణునకునుఁ బ♦రాయి లేఁడు!
******************
కవిత సంఖ్య: 171
తే.గీ.
కర్మువునఁ బనుల్ సిద్ధించుఁ! ♦ గాంక్షచేత
సిద్ధి నొందవు! నిద్రించు ♦ సింహ ముఖము
నందు జంతు ప్రవేశమ్ము ♦ నగునె? చూడఁ
గాంక్ష కాదయ్య జనులకు, ♦ కర్మ వలయు!
******************
కవిత సంఖ్య: 172
తే.గీ.
మేఘముల నీడ, దుర్జన ♦ మిత్రతయును,
పక్వమైనట్టి యన్నము, ♦ పడఁతి, ధనము,
యౌవన మ్మివి స్వల్పకా♦లావధిఁ గొని,
భోగ్యములు నౌచు నస్థిర♦ములయి యుండు!
******************
కవిత సంఖ్య: 173
తే.గీ.
ఆపదలలోన సహకార ♦ మందఁజేయు
నట్టివారలె నిజమైన♦యట్టి సఖులు!
సంపదలు నుండఁ దోడ్పడు ♦ సఖులు సఖులె?
వారు దుర్జనుల్! సజ్జనుల్ ♦ కారు భువిని!
******************
కవిత సంఖ్య: 174
కం.
ధనహీనుఁడు ధనికుని గృహ
మునకుం జను నెడల "యాచ్న♦మునకై వచ్చెన్!
గన నితఁడు యాచకుండే"
యని తలఁతురు! ధనము లేమి ♦ హా! ఛీత్కృతియే!
******************
కవిత సంఖ్య: 175
తే.గీ.
మేఘములు దాతలయి నీర ♦ మెపుడు గురియఁ
గరము లందున్న జలము లా ♦ నరుల కిడును!
సూర్యుఁడే యాచకుఁడు జల♦శోషకుఁడయి
కరములనుఁ జాఁచి కొనుచుండుఁ ♦ గాదె యెపుడు!!
******************
కవిత సంఖ్య: 176
తే.గీ.
ప్రాణములు వోయినను గాని ♦ ప్రాణ హితున
కును వియోగమ్ము గలుగంగఁ ♦ గోర రెపుడు!
ప్రాణములు వోవ, మరు జన్మ ♦ ప్రాప్తమగును!
ప్రాణ సఖుఁ డెట్లు లభియించుఁ ♦ బర భవమున?
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 01-02-2016
కవిత సంఖ్య: 177
శీర్షిక:- దూతను జంపుఁడు!
సమస్య:-
దూతను వధించు టెంతయు నీతి యగును!
[తేటగీతి సమస్య పాదమును కందమున నిమిడ్చి వ్రాసిన పూరణము]
(ప్రహస్తుడు రావణునితో హనుమంతునిగూర్చి పలికిన మాటలు)
కం.
సీత చెఱ మాన్ప వచ్చిన
యాతండు నశోకవనిని ♦ నసురులఁ గూల్చెన్!
దూతను వధించు టెంతయు
నీతి యగును రాక్షసేంద్ర! ♦ నిజ మిది వినుమా!!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 01-02-2016
కవిత సంఖ్య: 178
శీర్షిక:- శివధనుర్భంగము!
(రకారము వాడకుండ)
తే.గీ.
తునిమి తాటకన్, దాపసి♦తోడఁ జనియు,
జనక జనపాలు సభను భ♦స్మాంగు ధనువు
భంజనము సేసి, నయనోత్స♦వమ్ము సభకొ
సంగి, సీతఁ జేపట్టెఁ గౌ♦సల్యపట్టి!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 01-02-2016
కవిత సంఖ్య: 179
శీర్షిక:- కళాభిమానము - కళా రహితత్వము!
చంపకమాల:
సలలిత మోద దాయకము, ♦ సద్రస బంధుర సత్ఫలమ్ము స
ల్లలితకళాభిమానము! హ♦లాహల సన్నిభ, మెల్లవారికిన్
జ్వలిత హృదంతర హ్రదము, ♦ సంచలితాత్మ నికృంతనమ్ము, దు
ష్ఫలితద, మా కళారహిత ♦ సత్త్వ మదెంతయు దుఃఖ దాయియౌ!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 01-02-2016
శీర్షిక:- అయుత కవి బృందము!
కవిత సంఖ్య: 180
ఇందఱు కవులను గూరిచి
సుందరమగు బృందములను ♦ శోధించి వెసన్
విందుగ నందించిన నీ
కిందు నమస్సులు రవీంద్ర ♦ హితవర వినుమా!
*****************
కవిత సంఖ్య: 181
శత కవితల నందించియు
సతతము శ్రమియించి రచన ♦ సంస్తుతు లందన్
వితముఁ గనియు హితము నిడియు
శతమానం బగుచు నిలుచు ♦ శత కవికి నుతుల్!
*****************
కవిత సంఖ్య: 182
కందము వ్రాసితి నిప్పుడు
నందముగను నేఁటి దినము ♦ నానందముగన్
డెందము స్పందన లొందఁగ
సుందర పదములనుఁ జేర్చి ♦ శోభనుఁ గూర్తున్!
******************
కవిత సంఖ్య: 183
సుందర మొందెడి బృందము
లందుండిరి భావకవులు ♦ నభ్యుదయమ్మున్
బొందెడి జాతికి జాగృతి
నందఁగఁ జేసెడి సుకవులు ♦ నవ్యకవీశుల్!
******************
కవిత సంఖ్య: 184
ఇందఱు మహానుభావులు
నందఱకును వందనములు ♦ హారతు లిడుదున్
విందుగఁ జిన్నలకై నే
నందింతునుఁ బ్రేమతోడ ♦ నాశీస్సుమముల్!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 01-02-2016
కవిత సంఖ్య: 185
శీర్షిక:- జోతలు!
గోగులపాటి వారికి (నవ్య అఖిల్ జ్యోతి కృష్ణ...లు వచ్చునట్లుగ)
నవ్యమైనట్టి కవికిని ♦ నవ యుగమున
జ్యోతి చేతనుఁ బెట్టియు ♦ జోత లిడుచు
నఖిలమైనట్టి మార్గమ్ము ♦ నందఁజేసి
కృష్ణుఁడౌ వెన్నదొంగకుం ♦ గేలు మోడ్తు!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 02-02-2016
శీర్షిక:- జోతలు!
కవిత సంఖ్య: 186
అంజన్న హారతులకును
నంజలు లిడి కొలుతు నిపుడు ♦ నైపుణ్యముతో
సంజనిత హారతులె యివి
యంజన్నా కొనుము నతులు ♦ నభినందనముల్!
కవిత సంఖ్య: 187
ఏవీ వీరా పార్థులు
నేవైనను వ్రాసి బృంద ♦ మెద మురిపింపన్
దావులుఁ జిమ్మెడి కవితల
పూవుల మాలలు ధరింపఁ ♦ బూనఁగఁ గొలుతున్!
కవిత సంఖ్య: 188
కళల కళాధరుఁ డెప్పుడు
భళా యనియు భుజము తట్టి ♦ పదపద మనుచున్
గళమున కవితలఁ బాడుచుఁ
గళాధరుని శివుని గరళ ♦ కంఠునిఁ బొగడున్!
కవిత సంఖ్య: 189
మాడుగులకు నేనిటఁ గై
మోడిచి యందంగఁ జేతు ♦ ముదమగు కైతల్
వేడెద పద్దెము విడకని
వేడుకతో వ్రాయు మనుచు ♦ వినుతింతు సదా!
కవిత సంఖ్య: 190
సీవీకుమార లక్షణ
మావేదనతోడ నిడితి ♦ మా యందఱకున్
నీ విచ్చితి పద్దెములును
సేవా తత్పరత తోడఁ ♦ జిత్తము పొంగన్!
కవిత సంఖ్య: 191
కడబాలవారి శతకము
తడవెను గిరిజన వికాస, ♦ తాపములు వెసన్
గడుసరి పోకడఁ దెలిపిరి
గడగడ చదువంగ నెసఁగు ♦ కైతల తోడన్!
కవిత సంఖ్య: 192
వినసొంపగు నడకలతోఁ
దెనుఁగుం బద్దెముల మాతృ ♦ దేశీయతతోన్
గనుమంటివి వినుమంటివి
వినుమో మురళీధరుండ ♦ వేవేల నతుల్!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
*************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 02-02-2016
శీర్షిక:- జోతలు!
కవిత సంఖ్య: 193
అంబర మంటెడి కవితల
నంబటి భానుప్రకాశుఁ ♦ డాదరమున స్నే
హాంబరుఁడై రచియించెను!
సంబరమయి నేను సేతు ♦ సాదర నమముల్!!
*****************
కవిత సంఖ్య: 194
వినమిత కవితా కాంతుఁడ!
కనఁగను మా హనుమకొండ ♦ కన్నుల మెఱయన్
ఘనతం దెలుఁగునఁ బ్రకటిం
చిన నీకివె నా ప్రణతులు ♦ శ్రీకాంత్ శర్మా!
*****************
కవిత సంఖ్య: 195
మల్లీశ్వరి యరుణ ద్వయ
మల్లిరి కవితేందిర తన♦దైన సఖిత్వం
బెల్లెడ నందఁగఁ జేయఁగ!
నుల్లము రంజిల్ల వారి ♦ కొనరుతు నతులన్!
*****************
కవిత సంఖ్య: 196
పోకూరి వారు వచ్చినఁ
బోకూ ర్యవధాని మదినిఁ ♦ బొడసూపెఁ గదా!
మీ కవితల శతమునుఁ గన
నాకుం గాశీపతి కన♦నయ్యె! నమస్సుల్!!
*****************
కవిత సంఖ్య: 197
వచనమునను గేయముననుఁ
బచరించుచుఁ గైత లెపుడు ♦ ప్రకటించెడి యో
సుచరితులారా యిచ్చటఁ
బ్రచురమ్మయె మీ ఘనతయుఁ ♦ బ్రణతులఁ గొనుఁడీ!
*****************
కవిత సంఖ్య: 198
కందము మొదలిడి నంతనె
విందగు మాటలనుఁ జేర్చి ♦ వినుతింపంగన్
దొందర వల దభ్యసనము
ముందఱ మెఱుఁ గగును "ఏ వి"! ♦ ముదమయెఁ! బ్రణతుల్!!
*****************
కవిత సంఖ్య: 199
గడ్డము లక్ష్మణ్ గారికి
నడ్డము రా రెవరుఁ గవిత ♦ లల్లియుఁ బాడన్!
దొడ్డ యగు కంచు కంఠము
నొడ్డియుఁ బాడుచును ఘనత ♦ నొందితి! ప్రణతుల్!!
*****************
కవిత సంఖ్య: 200
సకల విద్యాప్రదాత్రి! వి♦శాలనేత్రి!
భ్రమరనీలవేణి స్వచ్ఛ♦వర్ణధాత్రి!
బ్రహ్మమానస సత్పుత్రి! ♦ స్వర సుగాత్రి!
బ్రాహ్మి! భగవతి! వరద! భా♦రతి నమోఽస్తు!
-:శుభం భూయాత్:-
***************************************************************************
అయుత కవితా మహా యజ్ఞమున మీ మీ బాధ్యలను నెఱవేర్చుచు జగతికి హితముం గూర్చెడి కవి తతికి హృదయ పూర్వక వందనము లొనఁగూర్చుచు నందఱనుం బేరుపేరున వినుతించు......
సుకవి జన విధేయుఁడు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి