Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఏప్రిల్ 21, 2016

పరమాత్మ స్వరూపము!



[శ్రీ టీ.పీ.కే.ఆచార్యులవా రడిగిన తైత్తిరీయోపనిషత్తులోని శిక్షావల్లియందలి
"యశ్ఛందసాం ఋషభో విశ్వరూపః " అనెడి మంత్రమును నేను సీసపద్యమున ననువదించి
వ్రాసితిని]


సీ.

ఎవఁడు వేదములలో ♦ నేకమౌ సారభూ
.....తమొ ప్రధానమ్మొ త♦త్సర్వరూపి;
ప్రణవామృత స్వరూ♦పమ్మైన వేదప్ర
.....కాశ శక్తుఁడగు నోం♦కార రూపి;
పరమేశుఁడే నాకుఁ ♦ బఱఁగ నాత్మజ్ఞాన
.....ధారణాంచిత ప్రజ్ఞ ♦ దక్షత లిడి;
నన్ బలపఱచుచో ♦ నతుల బ్రహ్మజ్ఞాన
.....సంపత్కరుండనై ♦ స్వయముగాను
గీ.
తనువు యోగ్యమ్మునై రస♦ననుఁ గన మృదు
మధుర భాషితయై శ్రోత్ర ♦ మధికముగను
వినికి గలదియై భాసిల్లి ♦ వెలిఁగిపోవఁ
బ్రణవమా నాదు విద్యనుఁ ♦ బరిఢవిలుము!


*శుభం భూయాత్*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి